జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ Vs మీరా చోప్రా


తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్ కి దక్కని అవకాశం మీరా చోప్రా కి తన తొలి చిత్రం ద్వారా లభించింది. అదేంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తో నటించే అవకాశం బంగారం సినిమా ద్వారా తనకు లభించింది. ఆ తర్వాత వాన,గ్రీకు వీరుడు అనే సినిమాలతో మనల్ని అలరించింది. మీరా చోప్రా పుట్టి పెరిగింది అంతా మన దేశ రాజధాని న్యూఢిల్లీలో.


ప్రియాంక చోప్రా,పరిణితి చోప్రా మరియు మన్నారా చోప్రా మీరా చోప్రా కి కజిన్స్ అవుతారు.మీరా చోప్రా తన తొలి సినిమా తమిళ్లో చేయడం జరిగింది.ఎస్.జె.సూర్య ఇందులో హీరోగా యాక్ట్ చేశారు.


ఇప్పుడు తనకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మధ్య గొడవ ఎలా స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది అనేదాని గురించి తెలుసుకుందాం.


మీరా చోప్రా ఇటీవల ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు.ఆ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకరు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడమని అడగడం జరిగింది.అందుకు సమాధానంగా మీరాచోప్రా జూనియర్ ఎన్టీఆర్ గురించి తనకు తెలియదని , తను మహేష్ బాబు కి ఫ్యాన్ అని, మహేష్ బాబు చాలా గొప్ప వ్యక్తి అని మీరాచోప్రా చెప్పడం జరిగింది.ఈ సమాధానం నచ్చక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మీరా చోప్రా ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.



మీరా చోప్రా కి యాక్టింగ్ చేయడం రాదని తను ఒక ప్రాస్టిట్యూట్ అని కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు.ముఖంపై యాసిడ్ పోస్తామని మరియు మర్డర్ చేస్తామని కూడా కొందరు కామెంట్ చేశారు.దాదాపు 30 వేల ట్వీట్లు మీరా చోప్రా ను టార్గెట్ చేస్తూ వచ్చాయి.


ఫాన్స్ ప్రవర్తిస్తున్న తీరు ఏమాత్రం బాలేదు అని బాధపడుతూ వీటిని భరించలేక సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు మరియు మీరాచోప్రా పుట్టి పెరిగింది ఢిల్లీలో కాబట్టి ఢిల్లీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయమని సూచించారు.


ఒక వ్యక్తి తన ఇష్టాఇష్టాలని స్వేచ్ఛగా చెప్పడంలో తప్పులేదు అని భావిస్తున్నాము.
చూద్దాం ఫ్రెండ్స్ మీరాచోప్రాకి న్యాయం జరుగుతుందో లేదో.

Powered by Blogger.