మన జీవితం లో తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు

ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఎన్నో సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఈరోజు మనం చూడబోతున్నాము..

వీరభద్ర దేవాలయం, లేపాక్షి |

Veerabhadra Temple, Lepakshi


ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉంది. ఈ గుడికి కొంచెం దూరంలో ఒక నంది విగ్రహం ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నంది. ఈ గుడిలో 70 పిల్లర్లు ఉంటాయి. అందులో ఒకటి నేలను తాకకుండా వేలాడుతూ ఉంటుంది. 1909లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ పిల్లర్ను నేలకు తాకేలా చేయాలని చూశాడు కానీ విఫలమయ్యాడు. ఫ్రెండ్స్ ఈ గుడిలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది, అదేంటంటే ఈ గుడిలోని గోడ మీద రెండు రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తపు మరకలు వెనక ఒక పురాతన కథ ఉంది, అది ఏంటంటే ఇప్పుడు చూద్దాం.అప్పట్లో ఈ స్థలంలో ఒక చిన్న శివుని గుడి ఉండేది . ఆ ప్రాంతానికి చెందిన గవర్నర్ అయిన వీరుపన్నకు కళ్ళు లేని కొడుకు ఉండేవాడు. ఆ అబ్బాయి ఈ గుడి ఉన్న ప్రాంతంలో ఆడుకుంటుండగా కళ్ళు వచ్చాయి. ఆ రోజు రాత్రి శివుడు వీరుపన్నకు కలలో కనిపించి తనకు ఒక పెద్ద గుడి కట్టించమని అడిగాడు. రాజు యొక్క అనుమతి లేకుండా కట్టడంతో రాజు విరూపణ్ణ కళ్ళను తీసేయమని ఆదేశించాడు. ఆ సమయంలో విరూపణ్ణ తన కళ్ళను తీసి గుడి గోడమీద విసరగా రక్తపు మరకలు ఏర్పడ్డాయి. కొందరు సైంటిస్టులు సైతం అవి మనిషి  యొక్క రక్తపు మరకలనీ పరిశోధనలు చేసి చెప్పారు. ఫ్రెండ్స్ ఈ గుడిలోనే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ గుడిలో ఒక పెద్ద పాదం ఉంటుంది. ఆ పాదం ఎప్పుడూ తడిగా ఉంటుంది. అది ఎందుకు అలా ఉంటుందో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. సో ఫ్రెండ్స్ ఇది మన జీవితంలో చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటి.

కైలాస టెంపుల్, ఎల్లోరా | 

Kailash Temple, Ellora



మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా కి 30 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. కొన్ని కొండలను గుహలుగా చెక్కారు. ఆ గుహలలోని పదహారవ గుహనే ఈ కైలాస టెంపుల్. ఈ కైలాస టెంపుల్ ఎవరు ఎప్పుడు కట్టారో ఇప్పటికి ఆధారాలు లేవు. రెండు లక్షల టన్నుల గ్రానైట్ మీద కేవలం సుత్తి ఉలి తో ఈ గుడిని చెక్కారు అని చెబుతుంటారు. ఇస్లామిక్ రూలర్ ఔరంగజేబ్ ఈ గుడిని కూల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. మూడు సంవత్సరాల కాలంలో కేవలం కొంత భాగాన్ని మాత్రమే నాశనం చేయగలిగాడు. దీన్నిబట్టి ఈ గుడి ఎంత పటిష్టమైందో అర్థమవుతుంది. 700 మంది పని వాళ్ళు, 150 సంవత్సరాల పాటు ఈ గుడిని కట్టి ఉంటారని అంచనా. కైలాస పర్వతం లాగా తెల్లగా కనిపించాలని ఉద్దేశంతో ఈ గుడికి  వైట్ ప్లాస్టరింగ్ కూడా చేశారు. కానీ కాలక్రమేణా ఈ  వైట్ ప్లాస్టరింగ్ పోవడంతో ఇప్పుడు పెద్దగా కనిపించదు.

జగన్నాథ్ టెంపుల్, పూరి | 

Jagannath Temple, Puri



ఫ్రెండ్స్ ఈ గుడికి వెళ్ళినప్పుడు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించవచ్చు. అదేంటంటే మీరు ఒక బట్టను మీ చేతిలో పట్టుకొని ఒక చోట నిలబడండి, ఆ బట్ట గాలి ఏవైపు విస్తుందో, ఆ వైపుకు ఊగుతూ ఉంటుంది. కానీ ఈ గుడి పైన ఉన్న జెండా మాత్రం గాలికి వ్యతిరేక దిశలో కదులుతూ కనిపిస్తుంది. దానికి కారణం ఫ్లూయిడ్ డైనమిక్స్ కాన్సెప్ట్. ప్రతి రోజూ గుడి పైభాగానికి ఒక పూజారి పాకుతూ వెళ్లి జెండాను మార్చాలి. ఇలా ఒక రోజు మిస్సైన గుడిని 18 సంవత్సరాల పాటు మూసి వేస్తారు. గుడి పైభాగం లో ఒక  సుదర్శన చక్రం ఉంటుంది. దాని పొడవు 20 అడుగులు, బరువు 1000 కేజీలు. దాన్ని ఎటువైపు నుంచి చూసినా ఒకేలా కనిపిస్తుంది. గుడి మీద ఒక పక్షి కూడా ఎగరదు. గుడి దగ్గర ఒక సముద్రం ఉంటుంది. గుడి బయట మీకు ఆ సముద్రం యొక్క అలల శబ్దం వినిపిస్తుంది. ఒకసారి గుడి లోపలికి వెళితే మీకు ఆ శబ్దం వినపడదు. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మారుస్తూ ఉంటారు.

బృహదీశ్వర టెంపుల్, తంజావూరు |

Brihadeeswara Temple, Thanjavur



985 నుంచి 1014 వరకు రాజరాజ చోళ మొత్తం దక్షిణ భారతాన్ని పరిపాలించేవాడు. ఈయనకు దేవాలయాలను కట్టించడం అంటే చాలా. ఇష్టం ఎన్నో చిన్న చిన్న దేవాలయాలను కట్టించాడు, కానీ ఒకరోజు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఒక పెద్ద గుడి కట్టించాలని అనుకున్నాడు. తమిళనాడులో ఉన్న తంజావూరు ని ఎంపిక చేసుకున్నాడు. ఎందుకంటే దక్షిణ భారతానికి రాజధాని తంజావూరు కనుక. ఈ గుడి కట్టి ఇప్పటికి వెయ్యి సంవత్సరాలు అవుతుంది, ఆరుసార్లు భూకంపం కూడా వచ్చింది ఈ ప్రదేశంలో. కానీ గుడికి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. ఈ గుడి శివునికి ప్రసిద్ధి. గుడి కట్టడానికి లక్ష 30 వేల టన్నుల గ్రానైటు ఉపయోగించారు. గుడి కింద వందకు పైగా సొరంగాలు ఉన్నాయి. తంజావూరులోని 10 ముఖ్యమైన స్థలాల కి ఈ సొరంగాల ద్వారా దారి ఉంటుంది. యుద్ధాలు జరిగే టప్పుడు ఈ సొరంగాలను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు మూసివేశారు.

సన్ టెంపుల్, కోణార్క్ | 

Sun Temple, Konark




ఫ్రెండ్స్ ఈ దేవాలయం ఒరిస్సా లో ఉంది. ఈ గుడి సూర్యదేవునికి ప్రసిద్ధి. ఏడు గుర్రాలు కలిసి 24 చక్రాలను లాగుతున్నట్లు గా ఈ గుడి ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఈ గుడిని ముందుగా సముద్రం ఒడ్డున కట్టారు. అప్పట్లో సముద్ర మార్గాన ట్రేడింగ్ చేసే వాళ్ళు, ఈ గుడిని ఒక ల్యాండ్ మార్క్ గా పరిగణించే వాళ్ళు. కానీ కొద్ది రోజుల తర్వాత సముద్రమట్టం తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఈ గుడి సముద్రం కి దూరంగా ఉంటుంది. ఈ గుడి రథం ఆకారంలో ఉంటుంది. అందువల్ల 24 చక్రాలు ఉంటాయి. ఇవి మామూలు చక్రాలు కాదు. నేల గడియారాలు లాగా పనిచేస్తాయి. ఇంగ్లీష్ లో sundial. అంటారు సూర్య కిరణాలు ఈ చక్రాల మీద పడినప్పుడు వచ్చే ప్రతిబింబం తో టైం ఎంత అవుతుందో తెలుసుకోవచ్చు. గుడి పైన యాభై రెండు టన్నుల ఐస్కాంతం ఉంటుంది, అలాగే గుడి క్రింద భాగంలో కూడా ఒక ఐస్కాంతం ఉంటుంది. మధ్యలో సూర్యుని విగ్రహం ఉంటుంది. ఐస్కాంతం ని ఇలా ఉంచడం వల్ల గుడిలోనీ విగ్రహం గాలిలో తేలుతూ ఉంటుంది. గుడి పైన ఐస్కాంతం ఎంత పవర్ఫుల్ అంటే 13వ శతాబ్దంలో ట్రేడింగ్ చేసే పోర్చుగీస్ షిప్స్ గుడి వైపు గా వెళ్తున్నప్పుడు, తమ షిప్స్ లో ఉన్న కంపాస్ చూపించే డైరెక్షన్స్ ని ఐస్కాంతం డిస్టర్బ్ చేసేది. అందువలన తమ ట్రేడింగ్ దెబ్బతినకూడదని గుడి పైన ఉన్న అయస్కాంతాన్ని తీసివేశారు. దాని వలన గుడి కూలిపోయింది. ఇప్పుడు కేవలం శిథిలాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇది కేవలం ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా ఉంది. గుడిలో ఉన్న విగ్రహాన్ని పూరి టెంపుల్ లో పెట్టారు. ఆస్ట్రానమీ, ఆర్కిటెక్చర్, ఎలక్ట్రిక్ మాగ్నెటిజం కాన్సెప్ట్ తో గుడి కట్టారు. నరసింహదేవ 1955వ సంవత్సరంలో ఈ గుడి కట్టించారు. పన్నెండు వందల మంది పన్నెండు సంవత్సరాల పాటు ఈ గుడిని కట్టారు.
Powered by Blogger.