జూన్ 21 రోజు ఆదివారం అమావాస్య మరియు గ్రహణం రావడం చాల అరుదు. రాహుగ్రస్త సూర్యగ్రహణం ఇది చూడటానికి "చూడామణి" ఆకారంలో ఉంటుంది. గ్రహణం ఉదయం 10. 25 నిమిషముల నుండి 1. 54 నిమిషముల వరకు ఉంటుంది. ఈ గ్రహణం కొన్ని వృషభం, మిథునం,కర్కాటకం, తులా, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీనం రాశు లకు చెడు ఫలితాన్నికలిగిస్తాయి. వీరికి ఆర్థికం గాను, శారీరక గాను, మానసికం గా ఇబ్బందులకు లోనవుతారని పలువురు జ్యోతిష్య విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా మిథునం, వృశ్చికం రాశూల వారికి చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాశులవారు గ్రహణాన్ని చూడరాదు. వీరు ఆ సమయములో మంత్ర జపం, సూర్యోపాసన చేసిన మంచిది. గ్రహణం తరువాత "రాగిచెంబులో గోధుమలను నింపి వెండి సర్పము కానీ సూర్య ప్రతిమను గాని వుంచి పండితులకు" దానం చేయాలి.
మేషం, సింహం, కన్య, మకర రాశులకు మంచి ఫలితానిస్తుంది. సంఘంలో మంచి, స్థిరాస్థి కొనుగోలు చేస్తారు. వీరు గ్రహణ సమయములో విష్ణు సహస్రనామాన్నీ పఠించిన మంచి జరుగును.
మిథునం, వృశ్చికం రాసి వారికీ వాహన గండం వుంది. కావున ప్రయాణాలను వాయిదా వేయండి..