మన తెలుగు రాష్ట్రానికి చెందిన కల్నల్ వివరాలు
పూర్తి పేరు
కల్నల్ భిక్కమళ్ల సంతోష్ బాబు మరణం
పుట్టిన తేదీ
1982
పుట్టిన స్థలం
సూర్యాపేట, తెలంగాణ
తల్లి, తండ్రులు
భిక్కమళ్ల మంజుల, భిక్కమళ్ల ఉపేంద్రర్
భార్య
సంతోషి
పిల్లలు
అభిజ్ఞ, అనిరుధ్
విద్యా భ్యాసం
1993 వ సంవత్సరం లో కోరుకొండ హైస్కూల్ లో 6వ తరగతి చేరారు.
2000లో 12 వ తరగతి పూర్తి చేసారు.
పూణేలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ చదివారు.
తరువాత ఇండియన్ మిలటరీ అకాడమీ (డెహ్రాడూన్) లో ట్రైనింగ్ పొందారు.
వృత్తి
మొదట 2004 డిసెంబర్ లో లెఫ్టోన్మెంట్ గా బీహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్ లో చేరారు.
2019 డిసెంబర్ లో ఇండియన్ కల్నల్గా గా మారారు. (ఆయన వయసు 37 సం//లు )
తన 15 ఏళ్ళ సర్వీసులో 4 పదోన్నతులు పొందారు. ఎన్నో గోల్డ్ మెడల్స్ తన వశంచేసుకొన్నారు. జమ్మూకాశ్మీర్ లోని లడక్ లోకల్నల్ కమాండర్ గా పనిచేసారు. ఢిల్లీ, కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, లడక్ ప్రాంతాలలో పనిచేసిన సంతోష్ 2007 లో ముగ్గురు చొరబాటు దారులను హతమార్చిన ఘనతను పొందారు.
కరోనా వైరస్ వల్ల
సంతోష్ కు హైదరాబాద్ కు బదిలీ చేస్తూ ఉత్తరువులు కూడా వచ్చాయి. మూడేళ్ల పటు హైదరాబాద్ లో పనిచేయాల్సి వుంది. కానీ కరోనావైరస్ విజృంభణ వల్ల లడక్ లోపనిచేయాల్సి వచ్చింది..
2020 జూన్ 15 వ తేదీ లో భరత్ చైనా సరిహద్దులో (లడక్) విధులలో ఉండంగా చైనా కామాండోస్ లు వాగివివాదం దిగారు. ఇరువర్గాల వాళ్ళు ఆయుధాలు లేకుండా ఛాతీలతో గుద్దుకోవడం, తరువాత సద్దుకోవడం సరిహద్దుల వద్ద పరిపాటి. కానీ ఈసారి ఈ వివాదం కల్నల్ ను కలిపి మొత్తం మన భారతీయ సైనికులు 20 మంది చనిపోయేంతగా మారింది.చైనా కమాండోస్ కూడా కొంతమంది చనిపోయారు.
లడక్ లో వీరమరణం పొందిన కల్నల్ పార్ధివదేహాన్ని మంగళవారం రాత్రి ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ పోర్టుకు తరలించినారు. కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లోనే అంత్యకీయాలు నిర్వహిచాలని సైనిక అధికారులు కోరినా తల్లితండ్రులు మాత్రం సూర్యాపేటలోనే అంత్యకీయాలు నిర్వహించాలిని నిర్ణయించుకున్నారు.
